- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘గోల్డెన్ టాయిలెట్’ ఇన్నేండ్ల తర్వాత దొంగ దొరికాడు!
దిశ, డైనమిక్ బ్యూరో: బ్రిటన్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లోని 18 క్యారెట్ల బంగారు టాయిలెట్‌ను దొంగలు 2019 సెప్టెంబర్‌లో అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఇనేళ్ల తర్వాత తాజాగా కేసు పురోగతి సాధించింది. సుమారు 50 కోట్ల విలువైన ‘గోల్డెన్ టాయిలెట్’ చోరీకి పాల్పడినట్లు తాజాగా యూకేకి చెందిన వ్యక్తి నేరాన్ని అంగీకరించాడు. బ్రిటీష్ చరిత్రలో కీలకమైన వ్యక్తి అయిన విన్‌స్టన్ చర్చిల్ జన్మస్థలంగా పిలువబడే అధ్భుతమైన బ్లెన్‌హీమ్ ప్యాలెస్ ఈ దొంగతనం జరగడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ గోల్డెన్ టాయిలెట్‌కు ‘అమెరికా’ అని పేరు పెట్టారు. దీనిని ప్రముఖ ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలన్ తయారు చేశాడు.
టాయిలెట్ దొంగతనం సమయంలో నలుగురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా వెల్లింగ్‌బరోకు చెందిన జేమ్స్ జిమ్మీ షీన్ (39) దొంగతనం తానే చేసినట్లుగా ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్ట్‌లో తాజాగా ఒప్పుకున్నాడు. అయితే షీన్ గతంలో కూడా పలు విలువైన వస్తువుల దొంగతనాల కేసులో 17 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. కాగా, మరో ముగ్గురు వ్యక్తులు చోరిలో తమ ప్రమేయాన్ని ఖండించారు. వారు ఫిబ్రవరి 2025 లో విచారణకు హాజరుకానున్నారు.