Ayushman Bharat : ‘ఆయుష్మాన్ భారత్’ అమలుకు కేజ్రీవాల్ ఆ షరతు పెట్టారు : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

by Hajipasha |
Ayushman Bharat : ‘ఆయుష్మాన్ భారత్’ అమలుకు కేజ్రీవాల్ ఆ షరతు పెట్టారు : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ దక్కకూడదనే దురుద్దేశంతోనే ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat) స్కీం ఢిల్లీలో అమలుకాకుండా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అడ్డుకున్నారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(Delhi LG) వి.కె.సక్సేనా ఆరోపించారు. ఈ స్కీం పేరును ‘చీఫ్ మినిస్టర్ ఆమ్ ఆద్మీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం ఆయుష్మాన్ భారత్’ అని మారిస్తే అమలు చేస్తానని 2018లో కేజ్రీవాల్ ప్రతిపాదించారని పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీమ్స్ ‘ఆయుష్మాన్ భారత్’ స్థాయిలో ప్రజలకు లబ్ధిని చేకూర్చలేవని వి.కె.సక్సేనా తెలిపారు. లక్షలాది మంది ఢిల్లీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలితాలు అందకుండా ఆప్ సర్కారు అడ్డుతగులుతోందన్నారు. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలంటూ బీజేపీ ఎంపీలు బుధవారం హైకోర్టులో జాయింట్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా ఈ అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

Advertisement

Next Story