- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Supreme Court: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకు బీఆర్ఎస్?
దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ ఢిల్లీలో పోరుకు సిద్ధమవుతుంది. పార్టీ పిరాయింపులపై ఈ నెల మూడోవారంలో సుప్రీంకోర్టులో కేసు వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు న్యాయవాదులను కూడా నియమించినట్టు పార్టీ వర్గాల సమాచారం. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఇతరపార్టీల్లోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే వ్యూహం రచిస్తుంది. పార్టీ పిరాయింపులపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టేందుకు సిద్ధమైంది.
ఢిల్లీలో న్యాయ పోరాటం
గత ఏడాది సెప్టెంబర్ లో హైకోర్టు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి సూచించింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని నిర్ణయానికి వచ్చింది. కానీ మూడు నెలలు గడిచినా స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన ఢిల్లీలో న్యాయపోరాటం చేయాలని గులాబీ పార్టీ సన్నద్ధమైంది. అందులో భాగంగానే తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ వ్యూహాలకు పదునుపెట్టింది. గతంలో ఇతర రాష్ట్రాల్లో పార్టీమారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను సైతం అధ్యయనం చేస్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంను గులాబీ పార్టీ కోల్పోయింది. దీంతో పార్టీ బలం 38 మంది ఎమ్మెల్యేలకు తగ్గింది. ఇందులో ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, భద్రాచలం, బాన్సువాడ, జగిత్యాల, చేవెళ్ల, గద్వాల్, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానాలకు చెందిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాల్సి ఉంది. కొంతమంది చేరుతారనే ప్రచారం జరిగింది.
కానీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చేరికలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే పార్టీమారిన ఎమ్మెల్యేలపై గులాబీ అనర్హత వేటుకోసం కోర్టు మెట్లు ఎక్కుతోంది. హైకోర్టు సైతం బీఆర్ఎస్ కు అనుగుణంగా తీర్పు ఇచ్చినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో లీగల్ ఫైట్ కు సిద్ధమైంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గులాబీ పార్టీ వాదిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయనిపుణులతోనూ మరోవైపు రాజ్యాంగ నిపుణుడు చెట్పట్ ఆర్యమా సుందరంతో బీఆర్ఎస్ నేతలు సమావేశం భేటీ అయి సుదీర్భంగా చర్చించారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని ఆర్యమా సుందరం బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్టుగా గులాబీ నేతలు స్పష్టం చేశారు. మరికొందరితోనూ మంతనాలు చేసి సుప్రీంకోర్టులో కేసు అంశంపై సూచనలు స్వీకరించారు.
ముగ్గురు ఎమ్మెల్యేల (ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, భద్రాచలం) అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయాన్ని, వాటికి సంబంధించిన అన్ని పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లడం ద్వారా విషయాన్ని జాతీయ స్థాయి అంశంగా మార్చలని బీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తుందని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కొత్త సంవత్సరంలో ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. గతంలో ఏ పార్టీ తీసుకొని విధంగా ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతవేటుఅంశాన్ని గులాబీ అధిష్ఠానం సీరియస్ గా పరిగణించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. గులాబీ పార్టీ అవలంభిస్తున్న లీగల్ వ్యూహాలతో పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తుంది. జనవరి మూడోవారంలో సుప్రీంకోర్టులో పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై పిటీషన్ దాఖలు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై వేటు పడే వరకు తమ పోరాటం ఆగదని పార్టీ నేతలు సైతం పేర్కొంటున్నారు. ఇంతకు బీఆర్ఎస్ ఆశలు నెరవేరతాయో? లేకుంటే పార్టీ మారకుండా అడ్డుకట్ట వేసేందుకే ఇలా లీగల్ ఫైట్ చేస్తున్నారా? రాబోయే స్తానిక, కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టేందుకు వ్యూహమా? పార్టీ కేడర్ లో సైతం నైరాశ్యం రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారా? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.