- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చెక్ పోస్ట్ వద్ద రాత్రి వేళలో చిన్న వాహనాలకు అనుమతి ఇవ్వాలి..ఎమ్మెల్యే ఆదేశం
దిశ, ఉట్నూర్ : కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో కొత్తగుడ చెక్ పోస్ట్ వద్ద రాత్రి 9 గంటల తర్వాత చిన్న వాహనాలను అనుమతి ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఫారెస్ట్ ఆఫీసర్లను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది గంటల తరువాత కవ్వాల్ అభయారణ్యం గుండా చిన్న వాహనాలు వెళ్ళకూడదని అటవీ అధికారులు కొత్త నిబంధనలు తీసుకోరావడంతో శనివారం అర్ధరాత్రి ఉట్నూర్ మండలం కొత్త గూడ చెక్ పోస్ట్ వద్ద భారీగా కార్లు, ఇతర చిన్న వాహనాలను చెక్ పోస్ట్ సిబ్బంది నిలిపివేశారు. దీంతో ఎముకలు కొరికే చలిలో కార్లలో ప్రయాణిస్తున్న స్త్రీలు, వృద్ధులు పడరాని పాట్లు పడ్డారు. చెక్ పోస్ట్ వద్ద భారీగా చిన్న వాహనాలు నిలిచిపోయాని తెలుసుకొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హుటాహుటిన స్వయంగా కారు నడుపుకుంటూ చెక్ పోస్ట్ కు చేరుకున్నారు.
అక్కడ ప్రయాణికులతో మాట్లాడారు. చలిలో వారు పడుతున్న బాధలు చూసి చలించి పోయారు. చెక్ పోస్ట్ సిబ్బందిని నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము వాహనాలు నిలిపి వేసామని చెప్పడంతో ఎమ్మెల్యే నిర్మల్ ఎఫ్డిపిటి శాంతారాం తో ఫోన్ మాట్లాడారు. కొత్త నిబంధనలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేనే కాకుండా వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యుడని కూడా ఉన్న విషయం గుర్తు చేశారు. తనకు తెలియకుండా కొత్త నిబంధనలు ఎలా అమలు పరుస్తారని నిలదీశారు వెంటనే వాహనాలు విడిచి పెట్టాలని కోరారు. ఆదిలాబాద్ డిఎఫ్ఓతో కూడా ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందికి గురి చేసే చర్యలు మానుకోవాలని సూచించారు.
చిన్న వాహనాల అనుమతి విషయంలో తాను అటవీ శాఖ మంత్రితో, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ తో మాట్లాడుతానని, ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఉన్నత స్థాయి నిర్ణయం జరిగే వరకు చిన్న వాహనాలను ఆపకూడదని సూచించారు. అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకోరావడంతో అధికారుల ఆదేశం మేరకు బీర్ సాయిపేట రేంజ్ అధికారి అరుణ, చెక్ పోస్ట్ సిబ్బంది వాహనాలను విడిచిపెట్టారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి చలిలో తమ కోసం వచ్చి తమకు సాయం చేసిన ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.