- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిబంధనలకు తిలోదకాలు.. అద్దెకు సొంత కారు.. పనులకు ప్రభుత్వ డీజిల్
దిశ బ్యూరో, కరీంనగర్ : ఇక్కడ నిబంధనలు చెప్పేందుకే పాటించేందుకు పనికిరావు అన్నట్టుగా ఉంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారుల తీరు. అద్దె వాహనాల పేరుమీద అక్రమాలకు తెర లేపుతూ అడిగేవారు ఎవరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు వచ్చినా అదేమీ పట్టనట్టు ప్రత్యేకత చాటుకుంటున్నారు. అమలు చేయాల్సిన అధికారే పట్టించుకోకపోవడంతో ఇక అద్దెకు కారు.. అక్రమానికి డీజిల్ కొట్టిస్తూ కార్పొరేషన్ ఖజానాకు గండికోడుతున్నారు. అధికారులే అండగా నిలవడంతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చుకుని ఆ కార్యాలయంలో రాజ్యమేలుతున్నారు.
అద్దెకు కారు.. అక్రమానికి డీజిల్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అద్దె వాహనాల నిబంధనలను అధికారులు తుంగలో తొక్కుతున్నారు. టాక్సీ ప్లేట్ వాహనాలను అద్దెకు తీసుకోవాలని నిబంధనలు ఉన్నప్పటికీ అవి పాటించడం లేదు. టాక్సీ ప్లేట్ వాహనంపై బిల్లులు తీసుకుంటూ ఓన్ ప్లేట్ వాహనాలను వాడుకుంటున్నారు. సహజంగా వాహనం సమకూర్చిన వాహన యజమాని మున్సిపల్‌కు సంబంధం లేకుండా డిజీల్ పోయించి వాహనాన్ని అధికారులకు సమకూర్చాలి. కానీ ఇక్కడ మున్సిపల్ డీజిల్‌ను యథేచ్ఛగా వాడుతూ మున్సిపల్ ఖజానాకు గండి కొడుతున్నారు. సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో కిందిస్థాయి సిబ్బంది సైతం అద్దెకు వాహనం.. అక్రమానికి డీజిల్ అన్నట్టుగా ప్రతి వాహనానికి మున్సిపల్ డీజిల్ వాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడిగే వారు లేకపోవడంతో ఇక్కడ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా మున్సిపల్ ఖజానా దోచేస్తున్నారు. గతంలో ఇలా అక్రమ ఆరోపణలు రావడంతో సదరు వాహనాన్ని అప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ పక్కకు పెట్టి తన సొంత వాహనంలో తిరిగారు. కాగా ఐఏఎస్ స్థాయి అధికారి ఇలా నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మా దృష్టికి వచ్చింది.. మరో వాహనం సమకూరే వరకు తప్పదు : చాహత్ బాజ్‌పాయ్, మున్సిపల్ కమిషనర్
మున్సిపల్ కమిషనర్ నిబంధనలకు విరుద్దంగా ట్యాక్సీ ప్లేట్‌కు బదులు ఓన్ ప్లేట్ వాహనం వాడుతున్నారని నా దృష్టికి వచ్చింది. మరో వాహనం కోసం ప్రయత్నం చేస్తున్నాం. వాహనం సమకూరగానే సమస్య పరిష్కారం అవుతుంది. చిన్న వాహనాల్లో తిరగడం ఇబ్బందిగా ఉంది. పెద్ద వాహనాలు సమకూరడం లేదు. అందుకే అలా ఇన్నోవా వాహనాన్ని వాడుతున్నాం.