Gautam Gambhir: గౌతం గంభీర్‌కు షాక్!

by Mahesh Kanagandla |
Gautam Gambhir: గౌతం గంభీర్‌కు షాక్!
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా హెడ్ కోచ్(Team India Head Coach) గౌతం గంభీర్‌(Gautam Gambhir)కు షాక్ తగిలింది. రియల్ ఎస్టేట్ చీటింగ్ కేసు(Cheating Case)లో మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ కోర్టు పక్కనపెట్టింది. ఆ కేసును మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. చీటింగ్ చేశారని ఫ్లాట్ బయ్యర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. గతంలో గంభీర్ ఓ రియల్ ఎస్టేట్(Real Estate) ప్రాజెక్టుగా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. అలాగే.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గానూ వ్యవహరించాడు. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పుడే కొంతమంది బయ్యర్లు డబ్బులు పెట్టి ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. కానీ, ఆ ప్రాజెక్టు ఎన్నటికీ కార్యరూపం దాల్చలేదు. కనీసం నిర్మాణాలకు అనుమతులు కూడా తీసుకోలేదని తెలుసుకున్న బయ్యర్లు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఫిర్యాదు చేశారు.

రియల్ ఎస్టేట్ కంపెనీలు రుద్ర బిల్డ్‌వెల్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఆర్ ఇన్‌ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్, యూఎం ఆర్కిటెక్చర్స్ అండ్ కాంట్రాక్టర్స్ లిమిటెడ్‌లు కలిసి ఓ రియల్ ఎస్టేట్ జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. గంభీర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాయి. ఫ్లాట్ల ప్రచారం చేయడంతోపాటు ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా కొనసాగారు. ఈ వెంచర్‌లో రూ. 6 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు డబ్బులు చెల్లించి ఫ్లాట్లు కొనుగోలు చేశారు. కానీ, ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. దీంతో గౌతం గంభీర్, ఇతరులపై ఫిర్యాదు చేశారు. గౌతం గంభీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా పొందాల్సినదానికంటే ఎక్కువగా ఆ కంపెనీల నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆయన బోర్డ్ డైరెక్టర్‌గానూ వ్యవహరించడంతో ఈ స్కామ్ ప్రాజెక్టులో ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఉన్నదని ఫిర్యాదుదారులు భావిస్తున్నారు. మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసులో గంభీర్‌ను నిర్దోషిగా పేర్కొంది. కానీ, తాజాగా ఢిల్లీ కోర్టు కేసును ఫ్రెస్‌గా దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

Advertisement

Next Story