Air India: భారత్-యూఎస్ రూట్లలో 60 విమానాలను రద్దు చేసిన ఎయిర్ఇండియా

by S Gopi |
Air India: భారత్-యూఎస్ రూట్లలో 60 విమానాలను రద్దు చేసిన ఎయిర్ఇండియా
X

దిశ, నేషనల్ బ్యూరో: నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా పదుల సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్య భారత్-యుఎస్ రూట్లలో దాదాపు 60 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. పీక్ ట్రావెల్ పీరియడ్‌లో రద్దు అయిన విమానాలలో శాన్ ఫ్రాన్సిస్కో, చికాగోకు వెళ్లే విమాన సేవలు కూడా ఉన్నాయి. కొన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఎక్కువ నిర్వహణ, సరఫరా సమస్యల వల్ల విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి కస్టమర్లకు సమాచారం అందించామని, వారికి అదే రోజు లేదా తర్వాతి రోజులలో ఇతర ఎయిర్ఇండియా గ్రూప్ విమానాల్లో ప్రయాణించేందుకు ఆఫర్ చేసినట్టు పేర్కొంది. రద్దయిన వాటిలో ప్రధానమైన ఢిల్లీ-చికాగో రూట్‌లో 14 విమానాలు, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్‌లో 28, ముంబై-న్యూయార్క్ రూట్‌లో నాలుగు విమానాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed