- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Drugs: బాలికకు డ్రగ్స్ అడిక్షన్.. యువకులకు ఎయిడ్స్
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్(Uttarakhand)కు చెందిన 17 ఏళ్ల బాలికకు హెరాయిన్(heroin) అడిక్షన్(Addiction) ఉన్నది. ఈ డ్రగ్స్(Drugs) కొనుగోలుకు డబ్బుల కోసం తప్పుదారి పట్టింది. యువకులకు వలపు వల విసిరి శారీరక సంబంధాలు పెట్టుకుంది. వారి వద్ద నుంచి పొందిన డబ్బులతో హెరాయిన్ డ్రగ్స్ కొనుక్కునేది. కానీ, ఈ శారీరక సంబంధం(Physical Relationship) ఒక యువకుడితో పరిమితం కాలేదు. ఆ బాలికకు హెచ్ఐవీ(HIV) ఉండటంతో ఆమెతో సంబంధంలోకి వచ్చిన యువకులందరికీ వైరస్ సోకింది. దీంతో నైనిటాల్ జిల్లా రామ్‌నగర్‌లో కేవలం ఐదు నెలల్లోనే 19 మందికి ఎయిడ్స్(AIDS) సోకింది. ఇక్కడ యేటా 20 కేసులు కూడా వచ్చేవి కావని, కానీ, 5 నెలల్లోనే 19 మందికి హెచ్ఐవీ పాజిటివ్ అని రావడంతో ఆందోళన చెందామని నైనిటాల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీశ్ చంద్రపంత్ వివరించారు.
యువకులు అనారోగ్యం బారిన పడటంతో బ్లడ్ టెస్టులు చేయగా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. ఇక్కడ ఇంకో ఆందోళనకర విషయం ఏమిటంటే.. హెచ్ఐవీ సోకిన ఈ యువకులకు ఇది వరకే పెళ్లైంది. దీంతో వారి భాగస్వాములకూ వైరస్ సోకింది. వైరస్ సోకిన యువకులందరికీ ఒక కామన్ లింక్ ఉన్నదని వారికి తెలియదని హెల్త్ ఆఫీసర్లు వివరించారు. కౌన్సిలింగ్ సెషన్‌లో వారంతా 17 ఏళ్ల బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నారని చెప్పారని, ఆమె వల్లనే వారందరికీ వైరస్ సోకిందని ఆ తర్వాత వారికి తెలిసిందని చెప్పారు. డ్రగ్స్ కోసం ఆ బాలిక శారీరక సంబంధాలు పెట్టుకుందని, దురదృష్టవశాత్తు ఈ యువకులు ఆమెకు ఎరగా మారారని తెలిపారు. రామ్‌నగర్‌లో గడిచిన 17 నెలల్లో 45 మందికి హెచ్ఐవీ పాజిటివ్ తేలిందని పేర్కొన్నారు.