- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IND VS AUS : ప్రతీకారం తీర్చుకుంటాం : పాట్ కమిన్స్
దిశ, స్పోర్ట్స్ : గత రెండు సార్లు టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ వేదికగా టీమిండియా 5 టెస్టుల సిరీస్‌ను ఆడనున్న విషయం తెలిసిందే. ఈసారి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన భారత్‌ను ఎలాగైనా అడ్డుకుంటామని కమిన్స్ స్పష్టంచేశాడు. అదేవిధంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.
‘స్వదేశంలో విజేతలుగా నిలవడం ఏ జట్టుకైనా ఆనందమే. ఆసీస్ ఆటగాళ్లూ అదే కోరుకుంటారు. భారత్‌తో తలపడబోయే బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ చాలా పెద్దది. గత 2 సార్లు ఆసీస్ గడ్డపై ఆడినప్పుడు మేం ఓడిపోయాం. ఇప్పుడు మంచి ఫామ్‌లోనే ఉన్నాం. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేస్తాం. భారత్‌తో గత రెండు సీజన్లు సరిగ్గా ఆడలేపోయాం. టీమిండియాను ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈసారి మాత్రం విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం’ అని కమిన్స్ తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించి 2018-19, 2020-21 సీజన్లలో టీమిండియా విజేతగా నిలిచింది.