Newzeland vs India : హర్షిత్ రాణాకు నో ప్లేస్!

by saikumar |   ( Updated:2024-10-30 19:49:31.0  )
Newzeland vs India :  హర్షిత్ రాణాకు నో ప్లేస్!
X

దిశ, స్పోర్ట్స్ : స్వదేశంలో న్యూజిలాండ్‌(Newzeland) తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లోనూ టీమిండియా(Team India) దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. బెంగళూరు, పుణె వేదికగా జరిగిన మ్యాచులు రోహిత్(Rohit sharma) సేనకు కలిసిరాలేదు. వాస్తవంగా చెప్పాలంటే జట్టు బలంగానే ఉన్నా కొందరు ప్లేయర్లు తప్పుడు నిర్ణయాలతో జట్టుకు ఓటమి తప్పలేదు. రెండో టెస్టులో ముగ్గురు ప్లేయర్లతో రంగంలోకి దిగినా రోహిత్‌ సేనకు కలిసిరాలేదు. దీంతో మూడో టెస్టులో సైతం జట్టులో మార్పులు చోటుచేసుకుంటాయని కథనాలు వచ్చాయి.

కానీ,ఎటువంటి మార్పులు లేకుండానే రోహిత్ సేన బరిలోకి దిగనుందని టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్‌ నాయర్‌ క్లారిటీ ఇచ్చారు. న్యూజిలాండ్‌తో జరిగే మూడో టెస్టులో హర్షిత్ రాణా(Harshit Rana)కు పిలుపు వస్తుందని జోరుగా ప్రచారం జరిగినా తుదిజట్టులో అతనికి చోటు దక్కలేదు. ప్రస్తుతం కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ట్రావెల్‌ రిజర్వ్‌గా కేకేఆర్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా ఉన్నాడు. ‘జట్టులో ఎలాంటి చేరికలు లేవు. ప్రతి వారం ముఖ్యమే. ప్రతిరోజు కీలకమే. WTC ఫైనల్ గురించి మేం ఎలాంటి ఆలోచనలు చేయడం లేదు. చివరి టెస్టుపై మేం దృష్టి పెట్టాలనుకుంటున్నాం’ అని ముంబై మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అభిషేక్‌ నాయర్‌ తెలిపారు.

Advertisement

Next Story