PAK : పాక్ గడ్డపై భారత్ ఆడాలి : మహమ్మద్ రిజ్వాన్

by saikumar |
PAK :  పాక్ గడ్డపై భారత్ ఆడాలి : మహమ్మద్ రిజ్వాన్
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC -champions trophy) వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చాలా కాలం తర్వాత తమ గడ్డపై ఐసీసీ ట్రోఫీ జరుగుతుండటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సైతం ప్రపంచవ్యాప్తంగా విచ్చేసే అతిథులు, అన్ని దేశాల క్రికెట్ అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లను చేస్తోంది. పాకిస్తాన్ లిమిటెడ్ ఓవర్స్ జట్టుకు ఇటీవల కెప్టెన్‌గా ఎంపికైన మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizman) ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత్ రావాలని ఆకాంక్షించాడు. టీమిండియా పాక్ గడ్డపై ఆడాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. వారు వచ్చేందుకు బీసీసీఐ ఓకే చెబితే ఘనస్వాగత్వం పలుకుతామని చెప్పారు.

భారత్ 2008 నుంచి పాకిస్తాన్‌ గడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక 2012 నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు సైతం జరగలేదు. 2023లో ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినప్పుడు సైతం భారత్.. శ్రీలంక వేదికగా మ్యాచులు ఆడింది. ఇదే విధానాన్ని చాంపియన్స్ ట్రోఫీకి సైతం ఫాలో అవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇటీవల తాను BCCI సెక్రటరీతో టచ్‌లో ఉన్నానని, వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాక్‌కు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ భారత ఆటగాళ్లను ప్రేమిస్తారు. మేము భారతదేశంలో కూడా (2023 ప్రపంచ కప్ సమయంలో) ఆ ప్రేమను అందుకున్నాము. అలాగే, భారత్ పాకిస్తాన్‌కు వచ్చి ఇక్కడ ఆడాలని మేము కోరుకుంటున్నాము. వారు ఛాంపియన్స్ ట్రోఫీకి వస్తారో లేదో నాకు ఖచ్చితంగా తెలీదు. కానీ, ఒక విషయం ఖచ్చితంగా చెబుతాను. వారు వస్తే ఇక్కడ అద్భుతమైన స్వాగతం లభిస్తుంది’ అని ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ముందు మహ్మద్ రిజ్వాన్ పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story