IPL -2025 : పది జట్లు రిటెన్షన్ చేేసుకునే ఆటగాళ్ల జాబితా ఇదే!

by saikumar |
IPL -2025 : పది జట్లు రిటెన్షన్ చేేసుకునే ఆటగాళ్ల జాబితా ఇదే!
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది ప్రారంభంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) -2025 మెగా వేలం జరగనుంది. ఈసారి పది జట్లు ఈ వేలంలో పాల్గొంటుండగా.. ఏ జట్టు ఏయే ఆటగాళ్లను రిటెన్షన్(Retention) (అంటిపెట్టుకుంటుందనే) అంశంపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక ఫ్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను తమతో అంటిపెట్టుకోవాలనుకుంటున్నాయో తెలిపేందుకు బీసీసీఐ(BCCI) ఈనెల 31 వరకు యాజమాన్యాలకు చాన్స్ ఇచ్చింది. ఆ గడువు గురువారంతో ముగియనుండగా.. ఇప్పటికే ఫ్రాంచైజీలు తాము రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల జాబితా(Crickters List)ను బీసీసీఐకు అందించినట్లు తెలుస్తోంది. మొత్తం 10 జట్లకు సంబంధించిన రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా నెట్టింట ఇప్పటికే వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుందనే దానిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కాగా, ఈసారి ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించబోయేది వీరిపైనే అంటూ క్రికెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

తాజా ఐపీఎల్ రూల్స్..

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో ఈసారి ఎటువంటి నిబంధనలను ఫ్రాంచైజీలు ఫాలో కావాలో వన్స్ చెక్ చేద్దాం.. కొత్త రూల్స్‌ ప్రకారం.. ఈసారి మేనేజ్మెంట్ల పర్స్‌ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు. ‘రైట్‌ టూ మ్యాచ్‌’ కార్డును కూడా ఉపయోగించుకునేందుకు సైతం ఫ్రాంచైజీలకు వీలు కల్పించింది బీసీసీఐ. దీని ప్రకారం.. ఒక ఆటగాడిని ఓ ఫ్రాంఛైజీ వదిలేశాక.. అతడు తిరిగి వేలంలోకి వస్తే.. మరో ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేశాక కూడా.. ఈ రైట్ టూ మ్యాచ్ కార్డును ఉపయోగించి పాత ఫ్రాంఛైజీ మళ్లీ సదరు ప్లేయర్‌ను వేలంలో నిర్ణయించిన ధరకుసొంతం చేసుకోవచ్చు.

ఒక జట్టుకు గరిష్టంగా ఆరుగురు..

ఈసారి మెగావేలంలో ఒక్కో జట్టు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవచ్చు. అందులో కనీసం ఒక్కరైనా అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ ఉండాలి. అనగా.. అన్ క్యాప్డ్ ప్లేయర్ గత 4 నుంచి ఐదేళ్ల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడని వ్యక్తి అయి ఉండాలి. ఇక తాము రిటెన్షన్ చేసుకోవాలనుకున్న తొలి ఐదుగురు ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ అయితే అతనికి రూ. 4 కోట్ల మేర మాత్రమే చెల్లించాలి.

రూ.75 కోట్లలో నచ్చినట్లు..

మెగావేలంలో పాల్గొనే అన్ని జట్లలో కొన్ని ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను వదులుకోవడానికి అస్సలు సిద్ధపడవు. అటువంటప్పుడు ఆటగాళ్ల డిమాండ్‌కు తగ్గట్లు భారీ మొత్తం కూడా చెల్లించాలి. అలాంటి ప్రాంఛైజీలకు బీసీసీఐ ఓ వెసలుబాటు కల్పించింది. తాము రిటైన్‌ చేసుకోవాలనుకునే తొలి ఐదుగురు క్రికెటర్లకు కలిపి గరిష్ట పరిమితిగా ఉన్న రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు.

ఐపీఎల్‌-2025 రిటెన్షన్‌ ప్లేయర్ల జాబితా రిలీజ్..

01. ముంబై ఇండియన్స్‌..

హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్) రూ. 18 కోట్లు, జస్‌ప్రీత్‌ బుమ్రా- రూ. 14 కోట్లు, తిలక్‌ వర్మ- రూ. 11 కోట్లు, సూర్యకుమార్‌ యాదవ్‌- రూ. 18 కోట్లు, నమన్‌ ధీర్‌(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, ఆకాశ్‌ మధ్వాల్‌ (అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, పర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు

02. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు..

విరాట్‌ కోహ్లీ - రూ. 18 కోట్లు, ఫాఫ్‌ డుప్లెసిస్‌- రూ. 14 కోట్లు, మహ్మద్‌ సిరాజ్‌- రూ. 11 కోట్లు, యశ్‌ దయాల్‌(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, అనూజ్‌ రావత్‌(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, రైట్‌ టు మ్యాచ్‌ కార్డు

పర్సులో మిగిలేది: రూ. 69 కోట్లు

౦౩.చెన్నై సూపర్‌ కింగ్స్‌..

రుతురాజ్‌ గైక్వాడ్‌- రూ. 18 కోట్లు, మతీశ పతిరణ- రూ. 14 కోట్లు, రచిన్‌ రవీంద్ర- రూ. 11 కోట్లు, రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు, ఎంఎస్‌ ధోని(అన్‌క్యాప్డ్‌- రిటైర్డ్ భారత క్రికెటర్‌)- రూ. 4 కోట్లు, రైట్‌ టు మ్యాచ్‌ కార్డు

పర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు

౦4.కోల్‌కతా నైట్‌ రైడర్స్‌..

శ్రేయస్‌ అయ్యర్‌- రూ. 18 కోట్లు, సునిల్‌ నరైన్‌- రూ. 14 కోట్లు, రింకూ సింగ్‌- రూ. 11 కోట్లు, ఆండ్రీ రసెల్‌- రూ. 18 కోట్లు, హర్షిత్‌ రాణా(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, అంగ్‌క్రిష్‌ రఘువంశీ(అన్‌కాప్డ్‌)- రూ. 4 కోట్లు

పర్సులో మిగిలేది: రూ. 55 కోట్లు

05.రాజస్తాన్‌ రాయల్స్‌..

సంజూ శాంసన్‌- రూ. 18 కోట్లు, జోస్‌ బట్లర్‌- రూ. 14 కోట్లు, రియాన్‌ పరాగ్‌- రూ. 11 కోట్లు, యశస్వి జైస్వాల్‌- రూ. 18 కోట్లు, సందీప్‌ శర్మ(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, రైట్‌ టు మ్యాచ్‌ కార్డు

పర్సులో మిగిలేది- రూ. 55 కోట్లు

౦6.లక్నో సూపర్‌ జెయింట్స్‌..

నికోలస్‌ పూరన్‌- రూ. 18 కోట్లు, మార్కస్‌ స్టొయినిస్‌- రూ. 14 కోట్లు, మయాంక్‌ యాదవ్‌- రూ. 11 కోట్లు, ఆయుశ్‌ బదోని(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, మొహ్సిన్‌ ఖాన్‌(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, రైట్‌ టు మ్యాచ్‌ కార్డు

పర్సులో మిగిలేది: రూ. 69 కోట్లు

07.పంజాబ్‌ కింగ్స్‌..

అర్ష్‌దీప్‌ సింగ్‌- రూ. 18 కోట్లు, సామ్‌ కరన్‌- రూ. 14 కోట్లు, కగిసో రబాడ- రూ. 11 కోట్లు, అశుతోశ్‌ శర్మ(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, రైట్‌ టు మ్యాచ్‌ కార్డు

పర్సులో మిగిలేది: రూ. 69 కోట్లు

08.ఢిల్లీ క్యాపిటల్స్‌..

రిషభ్‌ పంత్‌- రూ. 18 కోట్లు, అక్షర్‌ పటేల్‌- రూ. 14 కోట్లు, కుల్దీప్‌ యాదవ్‌- రూ. 11 కోట్లు, రసిఖ్‌ సలాం దర్‌(అన్‌​క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, అభిషేక్‌ పోరెల్‌(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, రైట్‌ టు మ్యాచ్‌ కార్డు

పర్సులో మిగిలేది: రూ. 69 కోట్లు

09.సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..

హెన్రిచ్‌ క్లాసెన్‌- రూ. 23 కోట్లు, ప్యాట్‌ కమిన్స్‌- రూ. 18 కోట్లు, అభిషేక్‌ శర్మ- రూ. 14 కోట్లు, ట్రావిస్‌ హెడ్‌- రూ. 14 కోట్లు, నితీశ్‌ రెడ్డి- రూ. 6 కోట్లు, రైట్‌ టు మ్యాచ్‌ కార్డు

పర్సులో మిగిలేది: రూ. 45 కోట్లు

10.గుజరాత్‌ టైటాన్స్‌..

శుభ్‌మన్‌ గిల్‌- రూ. 18 కోట్లు, మహ్మద్‌ షమీ/డేవిడ్‌ మిల్లర్‌- రూ. 14 ‍కోట్లు, సాయి సుదర్శన్‌- రూ. 11 కోట్లు, రషీద్‌ ఖాన్‌- రూ. 18 కోట్లు, రాహుల్‌ తెవాటియా(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు, మోహిత్‌ శర్మ(అన్‌క్యాప్డ్‌)- రూ. 4 కోట్లు

పర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు.

Advertisement

Next Story