అమెరికాలో రూ.1.32 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన టిక్‌టాక్

by Harish |
అమెరికాలో రూ.1.32 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన టిక్‌టాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల అమెరికాలో టిక్‌టాక్ నిషేధానికి సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ గత సంవత్సరం అమెరికాలో దాదాపు రూ.1.32 లక్షల కోట్ల($16 బిలియన్ల) ఆదాయాన్ని ఆర్జించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ శుక్రవారం నివేదించింది. దీంతో టిక్‌టాక్ మాతృ సంస్థ చైనాకు చెందిన బైట్‌డాన్స్ ఆదాయం 2023లో 120 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 40 శాతం పెరిగింది. టిక్‌టాక్ 2023లో రికార్డు స్థాయిలో సుమారు 170 మిలియన్ల అమెరికన్ వినియోగదారులను సాధించింది. ముఖ్యంగా అమెరికా యువత దీనిని ఎక్కువగా వాడుతున్నట్లు డేటా పేర్కొంది. 2023లో దాదాపు 47 మిలియన్ల డౌన్‌లోడ్‌లతో అమెరికాలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన సోషల్ మీడియా యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. మెటా ప్లాట్‌ఫారమ్‌ల ఆదాయం 2023లో 16 శాతం పెరిగి $134.90 బిలియన్లకు చేరుకోగా, దీనిని త్వరలో బైట్‌డాన్స్ అధిగమించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed