- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా కెరీర్లో నమ్మశక్యం కాని క్షణాలివే.. దిశా పటాని ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) పలు చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో ‘లోఫర్’(loafer) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’(Kalki) మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రజెంట్ ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ సూర్య ‘కంగువ’(Kanguva) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న దిశా పటాని(Disha Patani) ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘నా కెరీర్లో నమ్మశక్యం కానీ క్షణాలు ఇవే. ఎందుకంటే నేను ఈ చిత్రంలో అద్భుతమైన వ్యక్తులు, దర్శకుడు,(Director) నటులతో కలిసి పని చేశాను. తక్కువ సమయంలోనే మేమంతా ఒక కుటుంబంలా అయ్యాము. చిత్ర బృందం సహకారంతోనే ఎన్ని సవాళ్లు ఎదురైనా షూటింగ్ పూర్తి చేయగలిగాను.
తన సినిమాలో నటీనటులు సెట్స్‌కి వచ్చినప్పుడు సంతోషంగా పనిచేసుకోవాలని కోరుకుంటున్నా అని దర్శకుడు శివ(Shiva) నాకు మొదటి రోజు చెప్పారు. షూటింగ్ సమయంలో నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. సూర్య(Suriya)తో కలిసి పనిచేయడం నా జీవితంలో మర్చిపోలేను.. అది ఓ మంచి అనుభవం. ఆయన కంటే తన కళ్లు ఎక్కువగా మాట్లాడతాయి. సూర్య(Suriya) నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. బాబీ డియోల్(Bobby Deol), జగపతి బాబు ఇలా చాలా మంది లెజెండ్స్‌తో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.
Read More : వామ్మో.. దట్టమైన అడవిలో ఆ పని చేస్తున్న సమంత.. నెట్టింట దుమారం రేపుతున్న పోస్ట్