- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay : కలిసికట్టుగా అభివృద్ధికి శ్రీకారం..ఈ ఆనవాయితీ బాగుంది
దిశ, మల్యాల: కలిసికట్టుగా అభివృద్ధికి శ్రీకారం చుట్టడం రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి శాంతి వాతావరణం లో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం ఈ ఆనవాయితీ బాగుందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. మల్యాల ఎక్స్ రోడ్ నుండి నూక పెళ్లి రామన్నపేట గ్రామాల మీదుగా మేడిపల్లి మండలం కాచారం గ్రామం వరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించినరూ. 25 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులకు శనివారం స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipalli Satyam) తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని, కేంద్ర ప్రభుత్వంతో సహకరించలేదని, ఆడంబరాలకే ప్రారంభాలను చేశారని ఆయన అన్నారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మల్యాల ఎక్స్ రోడ్ నుండి కాచారం వరకు సింగిల్ గా గుంతలతో ఉన్న రోడ్ తో పలు గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారని, రోడ్డు విస్తరణతో నూకపల్లి రామన్నపేట పరిసర గ్రామాలు వాణిజ్య వ్యాపార రవాణా సౌకర్యాలు పెరుగనున్నాయని ఆయన తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి అయ్యేటట్లు చూడాలని బండి సంజయ్ ని కోరారు. రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు అయ్యేలా సహకరించిన కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar)కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి (Jeevan Reddy) కృతజ్ఞతలు తెలిపారు.