- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ : పోరాడి సాధించుకొని..పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణ(Telangana)లో మళ్లీ ఎమర్జెన్సీ(Emergency) రోజులొచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 20జిల్లా్ల్లో పోలీస్ యాక్ట్ అమలు వార్త కథనాన్ని ట్వీట్ కు జోడించారు. ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎనుకటి కాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు...హక్కులను అడిగితే బెదిరింపులు..పోరాడితే సస్పెన్షన్లు...ఇది నియంతృత్వ రాజ్యం...నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం అని మండిపడ్డారు.
పోరాటం తెలంగాణకు కొత్తకాదు..ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నదన్నారు. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తామని, ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతామని కేటీఆర్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.