Samantha: వామ్మో.. దట్టమైన అడవిలో ఆ పని చేస్తున్న సమంత.. నెట్టింట దుమారం రేపుతున్న పోస్ట్

by Kavitha |   ( Updated:2024-11-02 06:21:44.0  )
Samantha: వామ్మో.. దట్టమైన అడవిలో ఆ పని చేస్తున్న సమంత.. నెట్టింట దుమారం రేపుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు(Divorce) తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్:హనీ బన్నీ’(Citadel:Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది.

ఇదిలా ఉంటే.. సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒక విహారయాత్రకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌(Rajasthan)లోని ప్రఖ్యాత రణథంబోర్(Ranthambore) నేషనల్ పార్క్‌(Nationalpark)లో సమంత చక్కర్లు కొడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఆమె అక్కడే ఉన్నారు. చివరికి దీపావళి(Diwali)ని కూడా రణథంబోర్ కోట(Ranthambore Fort)లోనే జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అందులో పులి, మొసలితో పాటు అరుదైన పక్షులను చూడవచ్చు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పులిని చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read More : నా కెరీర్‌లో నమ్మశక్యం కాని క్షణాలివే.. దిశా పటాని ఎమోషనల్ కామెంట్స్

Advertisement

Next Story