KTR : పశు సంపదలోనూ గత పదేళ్లూ పండగే : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : పశు సంపదలోనూ గత పదేళ్లూ పండగే : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : పంటల దిగుబడిలోనే కాదు..పశు సంపద(Cattle wealth) లోనూ గత పదేళ్లూ పండగేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ట్వీటర్ వేదికగా చెప్పుకొచ్చారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక పదేళ్ళలో 2వేల కోట్ల పశు సంపద అభివృద్ధి చెందిందన్న కేంద్ర గణంకా కార్యక్రమాల అమలు శాఖ నివేదిక అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కులవృత్తులకూ కేసిఆర్ కొండంత అండగా..నిలవడం వల్లే పశుసంపదలోనూ గణనీయ వృద్ధి జరిగిందన్నారు. గ్రామీణ తెలంగాణలో ఉపాధి పెంచాలనే తపన, సంపద సృష్టిలో... అందరినీ భాగస్వామ్యం చేయాలనే తాపత్రయం, తెలంగాణలో ఉన్న డిమాండ్ తగ్గట్టుగా..

ఇక్కడే మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచే ప్రయత్నంతో కేసీఆర్ పశుగణాభివృద్ధిని అమలు చేశారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి ప్రతినిత్యం వచ్చే..వందలాది లారీల దిగుబడికి పదేళ్లలో కళ్లెం వేశారని, ప్రతి ఆలోచన వెనక.. ఒక సుదీర్ఘ అధ్యయనం ఉందని, కేసిఆర్ లక్ష్యం.. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమని, పదేళ్లలో (2000)వేల కోట్ల వృద్ధి జరిగిందని కేంద్రం ప్రకటించడం సంతోషదాయకమని ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ అద్భుత స్కీములను.. స్కాములు అని..దుష్ప్రచారం చేసిన దుర్మార్గులు.. ఇకనైనా తీరు మార్చుకోవాలని, కళ్లముందు ఆవిష్కృతమైన ఈ అద్భుతాలను చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. కానీ నేడు గొర్ల పంపిణీ లేక - చేప పిల్లల పంపిణి నిలిపేసి కుల వృత్తులను రూపుమాపే కుట్రలు చేస్తున్న పాలకులారా కేంద్ర లెక్కలు చూసైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed