- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Toxin Detox : శరీరంలో టాక్సిన్లతో రిస్క్.. ఈ సూపర్ డ్రింక్స్‌తో ప్రాబ్లం క్లియర్!
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండటానికి, ఆకలి తీర్చుకోవడానికి మనం ప్రతిరోజూ అన్నం, రొట్టెలతోపాటు వివిధ ఆహార పదార్థాలు తింటుంటాం. ఇవన్నీ జీర్ణమై శరీరానికి శక్తినిస్తాయి. అయితే కొన్నిరకాల ఆహార పదార్థాలు సక్రమంగా డైజెస్ట్ కాకపోవడంవల్ల టాక్సిన్ల రూపంలో అవి బాడీలోనే ఉండిపోతాయి. వీటినే బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా పేర్కొంటారు వైద్య నిపుణులు.
*దీర్ఘకాలికంగా శరీరంలో టాక్సిన్లు పేరుకుపోవడం, వాటిని కరిగించి శక్తిరూపంలో మార్చడానికి అవసరమైన శారీరక శ్రమలేకపోవడం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు వంటి వ్యాధులకు దారితీస్తాయి. వీటిని నుంచి తప్పించుకోవాలంటే టాక్సిన్లను ఎప్పటికప్పుడు బయటకు పంపాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రకాల జ్యూస్ కూడా అందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
* ఏబీసీ జ్యూస్ : ఏబీసీ జ్యూస్ అంటే మరేదో కాదు, యాపిల్, బీట్ రూట్, క్యారెట్‌లతో తయారు చేసే డ్రింక్స్. వీటివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో, పేరుకుపోయిన కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. లివర్‌ను డీటాక్స్ చేసి.. టాక్సిన్లను బయటకు పంపడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే ఈ జ్యూస్‌లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
*నిమ్మరసంతో ఎంతో మేలు : నిమ్మకాయలో విటమిన్ సితోపాటు బాడీని డిటాక్స్ చేయగల శక్తి ఉంటుంది. కాబట్టి లెమన్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిది. దీంతోపాటు కొంచెం అల్లం కూడా తీసుకోవడం ఇంకా మేలు చేస్తుంది. అల్లం షాట్‌లో నిమ్మరసం పిండుకుని తాగవచ్చు. అల్లం టీ తయారు చేసి అందులో నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి బాడీని డీటాక్స్ చేస్తుంది. లివర్‌ని క్లెన్స్ చేస్తుంది. ఇవి రెండూ అధిక బరువను తగ్గించడంలో సహాయపడతాయి.
* మిరియాలు, పసుపు కలిపి : చాలా మంది జలుబు, ఫ్లూ వంటివి చేసినప్పుడు పాలల్లో మిరియాలు, పసుపు కలిపి తాగుతుంటారు. వాస్తవానికి ఇది శరీరాన్ని డీటాక్స్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి.
* యాపిల్ సైడర్ వెనిగర్ : బాడీని డీటాక్స్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడే మరో జ్యూస్ యాపిల్ సైడర్ వెనిగర్. ఇది అందం, ఆరోగ్యం విషయంలో మంచి ప్రయోజనాలు అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. అలాగే బాడీని డీటాక్స్ చేసి, బరువు తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను, ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో డైల్యూట్ చేసి తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కాకపోతే నేరుగా మాత్రం తీసుకోవద్దు.
* పాలకూర స్మూతీ : పాలకూరను కూరగా వండుకొని తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే అరటిపండు, యాపిల్, వాటర్ మిక్స్ చేసి స్మూతీగా చేసుకొని తాగడంవల్ల బాడీలోని టాక్సిన్లు బయటకు పోతాయి. జుట్టు సమస్యలు కూడా దూరం అవుతాయి. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూర స్మూతీలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తిని అందించి, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే బాడీ సెన్సిటివిటీని బట్టి వీటిలో మీకు ఏదైనా పదార్థం పడదు అనుకున్నప్పుడు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలి.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.