- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viral Video : ఛీ.. ఇదేం పాడు బుద్ది! హాలోవీన్ వేడుకల్లో మహిళ దొంగతనం వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో దీపావళి వేడుకలు జరుపుతుంటే పాశ్చాత్య దేశాల్లో ‘హాలోవీన్ డే’ వేడుకలు జరుపుకున్నారు. అక్టోబర్ 31న హాలోవీన్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా కెనడాలో ఓ మహిళ పలు ఇళ్ల ముందు పిల్లల కోసం పెట్టిన క్యాండీస్, చాక్లెట్లు, గిఫ్ట్ బాక్స్, లైట్స్‌ను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాంప్రదాయ సల్వార్ కమీజ్ ధరించి, ఆమె ఒంటారియోలోని మార్ఖమ్ కార్నెల్ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ తెచ్చుకున్న సంచిలో అందిన కాడికి వేసుకోనిపోయింది. అయితే ఆమె భారత్‌కు చెందిన మహిళ అంటూ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వీడియో వైరల్ కావడంతో ఛీ.. ఇదేం పాడు బుద్ది అంటూ నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు విదేశాల్లో మన ఇండియన్స్ పరువు తీస్తున్నారని నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. కాగా, ‘హాలోవీన్ డే’ సందర్భంగా దెయ్యాల వేషం, విచిత్రమైన రూపాల్లో మేకప్ వేసుకుని ఈ పండుగ చేసుకుంటారు. అమెరికాలో ఎక్కువగా జరుపుకునే ఈ పండుగను.. నేడు అన్ని దేశాల్లోనూ చేసుకోవడం ప్రారంభించారు. ఇంటి ముందు డెకరేషన్ చేసి పిల్లల కోసం గిఫ్ట్ ప్యాక్‌లు, క్యాండీస్, వివిధ రకాల చాక్లేట్లు పెట్టి ఉంచుతూ సెలబ్రేషన్స్ జరుపుతారు.