- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Chandrababu: ఆడ బిడ్డల జోలికొస్తే వారికి అదే చివరి రోజు.. సీఎం చంద్రబాబు సంచలన వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి ఘటన(Tirupati incident)పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చిన్న పిల్లలను కూడా వదలకుండా చేస్తున్నారంటే అసలు వీళ్లు మనుషులేనా? అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండాలంటే.. నడిరోడ్డుమీద ఒకరిద్దరిని ఉరితీస్తేనే అడ్డుకోగలం అని సీరియస్ కామెంట్స్ చేశారు. గంజాయి, మద్యం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే హెచ్చరించాం. మరోసారి ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్ల అంటే విలాస వస్తువు కాదని అన్నారు.
అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ(Sankranti festival) నాటికి రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దని.. అన్ని గుంతలు పూడ్చాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రా ఎస్కోబార్ వచ్చి రోడ్లపై గుంతలు పెట్టి వెళ్లారని మాజీ సీఎం జగన్ను విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రోడ్లపై నాట్లు వేయడం, చేపలు పట్టిన దుస్థితి నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ఎస్కోబార్ పెట్టిన గుంతలు పూడ్చడానికే రూ.860 కోట్లు అవుతాయని తెలిపారు. వైసీపీ హాయాంలో నరకానికి మార్గాలుగా రహదారులను మార్చారని ధ్వజమెత్తారు. జనవరి నాటికి గుంతలు లేని రోడ్లుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.