అప్పుడప్పుడు పెద్దగా మరికొన్ని సార్లు చిన్నగా అవుతుంటాయి.. జబర్దస్త్ నటుడు బోల్డ్ కామెంట్స్

by Kavitha |
అప్పుడప్పుడు పెద్దగా మరికొన్ని సార్లు చిన్నగా అవుతుంటాయి.. జబర్దస్త్ నటుడు బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో(Jabardasthshow) ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రియాజ్(Riaz) కూడా ఒకరు. ఈయన తన కామెడి టైమింగ్స్‌తో ప్రేక్షకులను బాగా నవ్విస్తుంటాడు. అలాగే ఇతని హైట్ రియాజ్‌కు ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే కామెడీ లేక పోయినా ఇతను నడిచే తీరును చూసి ఆటోమెటిక్‌గా నవ్వోస్తుంటది. ప్రస్తుతం ఈయన కొన్ని సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అలా మంచి ఫేమ్ సంపాదించుకున్న రియాజ్ తాజాగా అనన్య నాగళ్ల నటించిన ‘పొట్టేల్’ మూవీలో కూడా నటించి మెప్పించాడు. అయితే తాజాగా 'పొట్టేల్'(Pottel) మూవీ టీమ్ సుమ(Suma) హోస్ట్‌గా నటిస్తున్న సమ అడ్డా(Suma Adda) షోకి అతిథులుగా విచ్చేశారు. అక్కడ రియాజ్ చేసిన ఫన్నీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి పొట్టెల్ మూవీ టీమ్ వచ్చింది. ఇందులో నోయెల్(Noel), రియాజ్(Riaz), అనన్య(Ananya), చందు కృష్ణ(Chandu Krishna) వచ్చారు. అయితే ఎప్పటిలాగే సుమ సరదాగా గేమ్స్ ఆడించింది. ఇందులో భాగంగా రియాజ్ అనన్యకు అన్నయ్యగా నటించాడు. అయితే హీరో చందు కృష్ణ కంటికి రియాజ్ కనిపించడు. అనన్య తన పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి తీసుకెళ్లి తన అన్నయ్య అని చూపిస్తే.. "అమ్మో మీ అన్నయ్యతో మాట్లాడాలంటే భయమేస్తుంది" అన్నాడు హీరో. దీంతో బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌లో అన్నయ్య అన్నావంటే అనే సాంగ్ వస్తూ ఉంటుంది.

దానికి రియాజ్ తన డైలాగ్ మర్చిపోయి నవ్వేసి అందరినీ నవ్వించాడు. తన హైట్ మీద ఇన్ డైరెక్ట్ కామెంట్స్ పడేసరికి "అయ్యో నేను చేయను. ఇందులోంచి నన్ను ఎలిమినేట్ చేయండయ్యా" అంటూ కామెడీ చేశాడు. ఇక ఈ షో లో కుర్చీ వేసుకుని మరీ హైట్‌గా కనిపించిన రియాజ్‌ని చూసిన సుమ.. " హే ఇంత ఎత్తుకు ఎప్పుడు ఎదిగావు" అని అడిగింది. అప్పుడు రియాజ్.. "ఎలాగో బయట ఎదగలేకపోయాను.. అందుకే మీ షోలో ఎదుగుదామని వచ్చా అంతే కాదు నా హైట్ అప్పుడప్పుడు పెద్దగా మరి కొన్ని సార్లు చిన్నగా అవుతూ ఉంటాయి" అంటూ స్టూల్ మీద నిలబడిన రియాజ్ కిందకు దూకి చిన్నగా కనిపించి కామెడీ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story