CM Chandrababu : బెల్డు షాపులు పెడితే.. బెల్ట్ తీస్తాం: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

by Shiva |
CM Chandrababu : బెల్డు షాపులు పెడితే.. బెల్ట్ తీస్తాం: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ అనకాపల్లి జిల్లా (Anakapally District) వెన్నెలపాలెం (Vennelapalem)లో రోడ్లపై గుంతలను పూడ్చే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైన్‌షాపుల (Wine Shops) నిర్వహకులు ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని అన్నారు. అలా కాదని ఎక్కువ ధరకు మద్యం అమ్మితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని అన్నారు.

అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ (Free Sand Policy)లో అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై పీడీ యాక్ట్‌ (PD Act) నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో చిన్నారులపై అత్యాచారాలు దారుణమని ఆయన అన్నారు. చట్టం ఒకవేళ పర్మిషన్ ఇస్తే.. ఒకరిద్దరిని నడిరోడ్డుపై ఉరి తీయాలని కామెంట్ చేశారు. అలా అయితేనే కామాంధుల్లో భయం పుడుతుందని అన్నారు. ఆడబిడ్డ విలాస వస్తువు కాదని.. అత్యాచారాలకు పాల్పడుతోన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement
Next Story

Most Viewed