మూడో టెస్టులో భారత్ ఆలౌట్.. లీడ్ ఎంతంటే..?

by Mahesh |
మూడో టెస్టులో భారత్ ఆలౌట్.. లీడ్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India), న్యూజిలాండ్ జట్ల మధ్య జరగుతున్న మూడో టెస్టు(3rd Test)లో భారత్ ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్(New Zealand) జట్టు.. బ్యాటింగ్ ఎంచుకోగా... 65.4 ఓవర్లకు 235 పరుగులకు ఆలౌట్ చేశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మొదటిరోజు 19 ఓవర్లు ఆడి.. నాలుగు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. అనంతరం రెండో రోజు మొదటి సెషన్ లో నిలకడగా రాణించిన భారత్(India) లంచ్ బ్రేక్ కు ముందు.. తడబడింది. రిషబ్ పంత్(Rishabh Pant) అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే వికెట్ సమర్పించుకొని వెళ్లిపోయారు. దీంతో భారత్(India) మొత్తం 59.4 ఓవర్లు ఆడి 263 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో జైశ్వాస్ 30, గిల్ 90, పంత్ 60, రోహిత్ 18, జడేజా 14 పరుగులు చేయగా.. ఆల్ రౌండర్ సుందర్ 38 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ 28 పరుగుల స్వల్ప లీడ్‌లో కొనసాగుతుంది. న్యూజిలాండ్ బౌలర్లలో అజజ్ పటేల్ 5, హెన్రీ, ఇష్ సోధీ, పిలిప్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed