Prabhas: విలన్‌గా ప్రభాస్.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో

by Hamsa |   ( Updated:2024-11-03 14:27:32.0  )
Prabhas: విలన్‌గా ప్రభాస్.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల ‘కల్కి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అదే ఫామ్‌తో ప్రజెంట్ రాజాసాబ్ (Rajasab), కల్కి-2, సలార్-2, స్పిరిట్, ఫౌజీ వంటి సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ప్రభాస్‌(Prabhas) కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ‘X’లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇందులో డార్లింగ్ విలన్‌గా మారి ఊహించని విధంగా ప్రవర్తిస్తూ కనిపించారు.

అయితే ఇది ‘చత్రపతి’ (Chatrapati)సినిమా సమయంలో తీసిన వీడియో అని తెలుస్తోంది. రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ విజయం నా వల్ల కాదని అన్నాడని ప్రభాస్(Prabhas) కోపంతో ఊగిపోయారు. కెమెరామెన్‌ను పిలిపించి పట్టుకుని వెళ్తుంటే ప్రభాస్ మూడు రోజుల వరకు వాడిని బయటకు రాకుండా చూసుకోమని చెప్తారు. అలాగే చత్రపతి విలన్ అని ఓ ఎక్స్‌ప్రేషన్ ఇస్తాడు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు డార్లింగ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Next Story