- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో ఉద్రిక్తత
X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు జరిపేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు కప్పట్రాళ్ల రక్షిత అడవిలో యరేనియం తవ్వకాలు జరిపేందుకు 68 బోర్లు సిద్ధమయ్యాయి. దీంతో దేవనకొండ మండలానికి చెందిన 15 గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలతో తాము అన్ని విధాలుగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాల అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కప్పట్రాళ్ల బస్ స్టాప్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో రోడ్డుపై రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.
Advertisement
Next Story