9 నుంచి అసెంబ్లీ సమాశాలు.. నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్

by srinivas |
9 నుంచి అసెంబ్లీ సమాశాలు.. నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) జరగనున్నాయి. అసెంబ్లీతో పాటు శాసనమండలి సమావేశాలు 9న ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Verma) నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు అసెంబ్లీలో హాలులో బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌లో అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాతికి రైతు భరోసా విడుదల చేస్తామని సీఎం చెప్పారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే రాష్ట్రంలో నిర్వహించిన కులగణన అంశం చర్చకు అవకాశం ఉందని సమాచారం. కాగా కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) గౌర్హాజరయ్యారు. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అలాగే విమర్శలు సైతం తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. మరి ఈసారి సభలకైనా కేసీఆర్ వస్తారా.. రారా అన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Advertisement

Next Story