- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bharat Ratna : భగత్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి.. రాజ్యసభలో ఆప్ ఎంపీ చద్దా డిమాండ్
దిశ, నేషనల్ బ్యూరో : స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌కు భారతరత్న పురస్కారాన్ని అందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. ‘‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు భగత్‌సింగ్. భారత్‌కు స్వాతంత్య్రం రావాలనే ఏకైక స్వప్నంతో జీవితం గడిపిన మహానుభావుడు భగత్ సింగ్. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను గౌరవిస్తూ భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలి’’ అని రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు.
‘‘భగత్ సింగ్ దేశం కోసం అమరుడై 93 ఏళ్లు గడిచినా.. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వలేకపోయాం’’ అని ఆప్ ఎంపీ తెలిపారు. 23 ఏళ్ల చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలిచ్చిన భగత్‌సింగ్‌ను చూసి ఆనాడు బ్రిటీష్ సామ్రాజ్యం పునాదులు కదిలాయన్నారు. భగత్‌సింగ్‌ను గౌరవించడం ద్వారా భారతరత్న పురస్కారానికే వన్నె వస్తుందని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.