Rishab pant : పంత్‌పై భారత మాజీ కోచ్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
Rishab pant : పంత్‌పై భారత మాజీ కోచ్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్‌పై టీంఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. టెస్ట్ క్రికెట్‌లో పంత్ ఓ సంచలనం అని అభివర్ణించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2020-21 సిరీస్‌లో భాగంగా గబ్బా టెస్ట్‌లో పంత్ చేసిన 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. ఒత్తిడిలో కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్ 32 ఏళ్ల తర్వాత గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాపై భారత్‌కు చిరస్మరణీయమైన విజయం అందించాడన్నాడు. టెస్ట్ క్రికెట్‌‌ను తొందరగా అర్థం చేసుకున్న పంత్ ధోనీ తర్వాత అతని స్థానాన్ని త్వరగా భర్తీ చేశాడన్నాడు. ‘పంత్ అద్భుతమైన క్రికెటర్. నీళ్లలో బాతులాగా టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇది అసాధారణమైనది. ధోని క్రికెట్ వీడిన తర్వాత భారత జట్టును ఊహించడం కష్టంగా మారింది. ఆ సమయంలో కొత్తగా ఎవరు వచ్చినా కుదరుకునేందుకు కొంత సమయం పడుతుంది. అయితే పంత్ ధోనీని రిప్లేస్ చేశాడని చెప్పడం లేదు. కానీ టెస్ట్ క్రికెట్‌లో పంత్ ప్రదర్శన సంచలనం.’ అని ద్రవిడ్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed