Ambedkar : డిసెంబరు 6న లోకల్ హాలిడే..ఎందుకంటే..

by Hajipasha |
Ambedkar : డిసెంబరు 6న లోకల్ హాలిడే..ఎందుకంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(Ambedkar) వర్ధంతి సందర్భంగా డిసెంబరు 6న మహారాష్ట్ర ప్రభుత్వం లోకల్ హాలిడేగా ప్రకటించింది. ముంబై, ముంబై సబర్బన్ జిల్లాల పరిధిలోని అన్ని గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ ఆఫీసుల్లో శుక్రవారం రోజున సెలవుదినాన్ని పాటిస్తారని వెల్లడించింది. ఆ రోజున ‘‘అంబేద్కర్ మహాపరినిర్వాన్ దివస్’’(Mahaparinirvan Diwas 2024)ను జరుపుకుంటారని రాష్ట్ర సర్కారు తెలిపింది.

అంబేద్కర్ వర్ధంతి నేపథ్యంలో ముంబైలోని శివాజీ పార్క్‌లో ఉన్న అంబేద్కర్ చైత్య భూమి సందర్శనకు పెద్దసంఖ్యలో ప్రజానీకం పోటెత్తనున్నారు. ఈనేపథ్యంలో చైత్య భూమి మార్గంలోని రహదారుల్లో రాకపోకలు సాగించేవారికి ఈనెల 7 వరకు ముంబై ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed