- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ పొజిషన్‌లో అయినా బ్యాటింగ్‌కు సిద్ధమే.. : కేఎల్ రాహుల్
దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు ప్లేయింగ్ 11లో స్థానం దక్కితే చాలు అని ఏ పొజిషన్‌లో అయినా బ్యాటింగ్‌కు దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కేఎల్ రాహుల్ అన్నాడు. రెండో టెస్ట్‌కు ముందు బుధవారం అడిలైడ్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ మాట్లాడాడు. ‘ప్లేయింగ్ 11లో చోటు దక్కితే చాలు.. టీం కోసం ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌కు దిగుతాను. పరిస్థితులకు అనుగుణంగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాను. అదృష్టవశాత్తు ఇప్పటికే ఆయా పొజిషన్లలో బ్యాటింగ్‌కు దిగాను. దాన్ని చాలెంజింగ్‌గా భావిస్తాను. తొలి 20-25 బంతులు ఎలా ఆడాలి. తర్వాత ఎలా అటాక్ చేయాలనేది తొలి నాళ్లలో సమస్యగా ఉండేది. వివిధ ఫార్మాట్లకు ఆడటం ద్వారా ప్రస్తుతం ఆ సమస్యను అధిగమించాను.’ అని రాహుల్ అన్నాడు. ఏ పొజిషన్‌లో బ్యాంటింగ్‌కు రావాలో మీకు చెప్పారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. చెప్పారని కానీ అది మీతో పంచుకోవద్దని కూడా చెప్పారని రాహుల్ అన్నాడు.