- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Indigo: చెత్త ఎయిర్‌లైన్స్‌గా పేర్కొన్న సర్వేను ఖండించిన ఇండిగో
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై ఓ నివేదిక చెత్త ఎయిర్‌లైన్‌గా అభివర్ణించింది. సమయపాలనతో పాటు ఇతర పారామితుల ఆధారనంగా ఇండిగోకు చివరి ర్యాంకును ఇచ్చింది. దీనిపై స్పందించిన ఇండిగో సర్వే పేర్కొన్న అంశాలను ఖండించింది. తాము అందించే విమానయాన సేవలను వచ్చిన సర్వేను తోసిపుచ్చుతూ.. సమయపాలంతో పాటు అన్ని రకాల సేవలను మెరుగుపరుస్తున్నామని స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన క్లెయిమ్ ప్రాసెసింగ్ ఏజెన్సీ ఎయిర్‌హెల్ప్ సంస్థ(ఎయిర్‌హెల్ప్) ఈ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వేలో ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత జనాదరణ పొందిన విమానయాన సంస్థలను పోల్చి చూస్తారు. ఇది ఆయా ఎయిర్‌లైన్ సంస్థల సమయపాలన, సేవా నాణ్యత, పరిహారానికి సంబంధించి క్లెయిమ్‌ల అందించడంలో కస్టమర్లతో వ్యవహరించే తీరు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇండిగోకు 109 సంస్థల్లో 4.80 పాయింట్లతో 103వ ర్యాంకును ఇచ్చింది. ఎయిర్‌హెల్ప్ తన వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాలను నిరాకరించిన ఇండిగో, సర్వేలో పేర్కొన్న డేటా కోసం భారత్‌ను నుంచి సేకరించిన శాంపిల్ సైజ్‌ను పేర్కొనలేదని స్పష్టం చేసింది. గ్లోబల్ ఏవియేషన్ పరిశ్రమ ఉపయోగించే పద్దతి లేదా మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోలేదని ఓ ప్రకటనలో తెలిపింది. అయిర్‌హెల్ప్ విశ్వసనీయతపై తమకు సందేహాలున్నాయని వెల్లడించింది.