BGT 2024 : కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు రావాలి.. : రవిశాస్త్రి

by Sathputhe Rajesh |
BGT 2024 : కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు రావాలి.. : రవిశాస్త్రి
X

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అడిలైడ్‌లో బ్యాటింగ్‌కు దిగే స్థానంపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్ట్‌లో ఓపెనర్‌గా దిగిన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 77 పరుగులు చేసి జట్టు మెరుగైన స్థితిలో ఉండడానికి కారణమయ్యాడు. అయితే రోహిత్ రాకతో రెండో టెస్టులో ఓపెనింగ్‌కు ఎవరు దిగుతారనే చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా రవిశాస్త్రి బుధవారం ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ..‘ రోహిత్ సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదు. అతను జట్టుతో కలవడం ప్లస్ పాయింట్. రోహిత్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. ఆ అనుభవం మిడిల్ ఆర్డర్‌లో జట్టుకు మరింత లాభం చేకూరుస్తుంది. యువకులతో మిడిల్ ఆర్డర్ మిక్స్ అప్ బాగుంటుంది. అయితే ఓపెనింగ్‌కు దిగాలా, లేక మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలా అనేది రోహిత్ చాయిస్. ఆస్ట్రేలియాలో మోస్ట్ డేంజరస్ ఆటగాడిగా అతడికి పేరుంది.’ అని అన్నాడు. అయితే ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఎక్కువ సమయాన్ని గడపని రోహిత్ కన్నా రాహుల్ ఓపెనింగ్‌కు దిగితేనే మేలు అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా రోహిత్‌ను చూడకూడదనుకునే స్థానంలో బరిలోకి దిగితే బాగుంటుంది. రాహుల్ ఓపెనింగ్‌కు రావాలి. రోహిత్ ఐదు లేదా ఆరో స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగలడు అని రవిశాస్త్రి అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed