దిశ నిజాలను నిర్భయంగా బయటపెడుతుంది

by Naveena |
దిశ నిజాలను నిర్భయంగా బయటపెడుతుంది
X

దిశ,పెన్ పహాడ్ : పెన్ పహాడ్ మండల కేంద్రంలో పెన్ పహాడ్ ఇన్చార్జి ఎమ్మార్వో తహసిల్దార్ లాలు నాయక్ 2025 దిశ క్యాలెండర్ ని ఆవిష్కరణ చేశారు. వారు మాట్లాడుతూ..దిశ పత్రిక రంగంలో చాలా తక్కువ సమయంలో అందరికీ నికార్సు అయిన వార్తలు అందిస్తూ నిజాలను నిర్భయంగా రాస్తుందన్నారు. మంగళవారం పెన్ పహాడ్ మండల ఇంచార్జ్ తహశీల్దార్ కార్యాలయంలో దిశ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రజలకు నిఖార్సయిన వార్తలు అందిస్తున్న పత్రిక దిశ దిన పత్రిక ఆన్నారు. పత్రిక రంగంలో తనదైన శైలిలో వార్తలు రాస్తూ తనదైన మార్క్ వేసుకుందని దిశ దినపత్రిక ను కొనియాడారు. కొద్దిరోజుల కాలంలోనే డిజిటల్ రంగంలో నెంబర్ వన్ స్థానంలో దిశ దినపత్రిక నిలిచిందన్నారు. ఈ కార్యక్రమం లో పెన్ పహాడ్ మండల తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది,దిశ పత్రిక రిపోర్టర్లు తండ నాగేందర్, బోల్లికొండ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed