- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హాస్టల్ యాజమాన్యందే తప్పు..!
దిశ, నర్సంపేట: నర్సంపేట మండల సమీపంలోని జయముఖి కళాశాలలో బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అవినాష్ రెడ్డి (20)సోమవారం సాయంత్రం విద్యుత్ షాక్ కి గురై చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అవినాష్ రెడ్డి మృతి చెందాడని విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యం పై కేసు పెట్టాలని, నష్టపరిహారంగా రూ.25 లక్షలు ఇవ్వాలని కళాశాల విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
మృతుడి మిత్రుల కథనం ప్రకారం...
ముగ్దుమ్ పురం గ్రామ సమీపాన గల జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్మల్ కి చెందిన అవినాష్ రెడ్డి బీ ఫార్మసీ లో చేరాడు. నెల రోజుల కిందటే కాలేజీ ఎదుట గల హాస్టల్ లో జాయిన్ అయ్యాడు. ప్రతీ రోజు హాస్టల్ కి కళాశాల క్యాంటీన్ నుంచి భోజనం తీసుకువస్తున్నట్లు సమాచారం. క్యాంటీన్ నడిపే వ్యక్తి కొడుకు వివేక్ కాలేజ్ బయట హాస్టల్ ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కాలేజీ నుండి అవినాష్ తన మిత్రులతో కలిసి హాస్టల్ కి చేరుకున్నాడు. హాస్టల్ లో బోర్ వాటర్ ట్యాంక్ లోకి రావట్లేదని గమనించిన నిర్వాహకుడు వివేక్ అవినాష్ కి మోటార్ పని చేయట్లేదని ఓసారి చూడాలని చెప్పడంతో మోటార్ దగ్గరికి వెళ్ళాడు.
అప్పటికీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మోటార్ పైప్ సరిచేసే క్రమంలో అవినాష్ విద్యుత్ షాక్ కి గురయ్యాడు. స్పృహ కోల్పోయిన అవినాష్ ని వెంటనే ముగ్దుమ్ పురం లోని ఓ ఆర్.ఎం.పీ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నుండి నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే అవినాష్ మృతి చెందాడు. మొదట నర్సంపేట ఆస్పత్రికి తీసుకెళ్తే అవినాష్ బతికే అవకాశం ఉండేదని కళాశాల మిత్రులు ఆరోపిస్తున్నారు.
యాజమాన్యంపై విద్యార్థి సంఘాల ఫైర్...
కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే అవినాష్ మృతి చెందాడని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. ఓ వైపు కళాశాల యాజమాన్యం మాత్రం అది ప్రైవేట్ హాస్టల్ అని, దానికి కళాశాలకు సంబంధం లేదని అనడం గమనార్హం. కాగా జయముఖి కళాశాల క్యాంటీన్ పేరుతో హాస్టల్ రసీదులు ఉన్నాయని, అది కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే హాస్టల్ అని విద్యార్థి సంఘాలు, కళాశాల విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘాలను చెదరగొట్టారు. బస్సులో అందరినీ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
కన్నీటి పర్యంతమైన వందలాది మంది విద్యార్థులు...
తమతో కలిసి చదువుతున్న తోటి విద్యార్థి క్షణాల వ్యవధిలో మృత్యువాత పడటం కళాశాల విద్యార్థులను శోకసంద్రంలో ముంచింది. కళాశాల సిబ్బంది సహా విద్యార్థులు నర్సంపేటలోని పోస్ట్ మార్టం దగ్గరికి చేరుకున్నారు. నిర్మల్ జిల్లా లోని తానురు మండలం ఎలివి గ్రామానికి చెందిన కొండలవాడి దత్తరెడ్డి, లక్ష్మి దంపతులకు అవినాష్ ఒక్కగానొక్క కొడుకు. అవినాష్ తండ్రికి ఇటీవలే పక్షవాతం వచ్చినట్లు సమాచారం. నిరుపేద కుటుంబానికి చెందిన అవినాష్ మృతితో అతని కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తమకు బతుకుపై ఆశల్లేవని రోదిస్తుండటం అందరినీ కలచివేసింది.