15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ.. స్విగ్గీ కొత్త యాప్ లాంచ్

by S Gopi |
15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ.. స్విగ్గీ కొత్త యాప్ లాంచ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కొత్త యాప్‌ను ప్రారంభించింది. గత కొంతకాలం నుంచి అత్యంత వేగంగా పెరుగుతున్న క్విక్ కామర్స్ విభాగంలో మరింత పోటీ ఇచ్చేందుకు స్విగ్గీ 'స్నాక్' పేరుతో దీన్ని తెసుకొచ్చింది. క్విక్ మీల్స్ లాంటి ఫుడ్ డెలివరీలతో పాటు స్నాక్స్, బేవరేజెస్‌ల డెలివరీలను కేవలం 10-15 నిమిషాల్లో అందించేలా ఈ యాప్ సేవలను లాంచ్ చేసింది. ప్రస్తుతానికి ఈ సేవలు బెంగళూరుకు మాత్రమే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది. బీజీగా ఉండే పట్టణాల్లో వినియోగదారులకు తక్కువ సమయంలో అవసరమైన వాటిని అందించేందుకు స్నాక్ పనిచేస్తుందని స్విగ్గీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ యాప్ ప్రధానంగా క్విక్ బైట్‌గా తక్షణ తినాలనుకునె వారికోసం రూపొందించారు. బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్, లైట్ మీల్స్, వివిధ రకాల కూల్‌డ్రింక్స్ వంటిని యాప్ మెనూలో ఉంటాయి. ఈ యాప్ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో ఉంది. కాగా, ఇప్పటికే ఫుడ్ డెలివరీ విభాగంలో జొమాటో అనుబంధ క్విక్ కామర్స్ కంపెనీ బ్లింక్ఇట్ తన బిస్ట్రో యాప్ నుంచి 10 నిమిషాల్లో స్నాక్స్, ఇతర ఆహార పదార్థాలను డెలివరీ చేస్తోంది. జెప్టో సైతం జెప్టో కేఫ్ పేరుతో తక్షణం కావాల్సిన ఆహార పదార్థాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో స్విగ్గీ వీటికి పోటీగా ప్రత్యేక యాప్ తీసుకురావడం గమనార్హం. అయితే, ఇప్పటికె స్విగ్గీ 10 నిమిషాల ఫుడ్ డెలివరీ కోసం బోల్ట్ సేవలను స్విగ్గీ యాప్‌లోనే అందిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed