- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాఠశాలల్లో రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలి
దిశ, నారాయణ పేట ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రౌండ్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలను చివరగా ఏ అధికారి విజిట్ చేశారని హెచ్ ఎం ను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఎంపీడీఓ పాఠశాలను విజిట్ చేసినట్లు తెలుసుకున్న కలెక్టర్ విజిటర్ రిజిస్టర్ ను చూశారు. కానీ అందులో ఎంపీడీఓ విజిట్ చేసినట్లు సంతకం లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైనా జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాఠశాల విజిట్ కు వస్తే వారితో రిజిస్టర్ లో సంతకాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఫుడ్ టేస్ట్ రిజిస్టర్,అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్, స్టూడెంట్ ఫుడ్ కమిటీ రిజిస్టర్,స్టాక్ రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. 6వ తరగతి గదిలోకి వెళ్ళిన కలెక్టర్ విద్యార్థులు కింద కూర్చోవడం చూసి విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవా అని ప్రశ్నించారు. పాఠశాల పై అoతస్తులో గల ఓపెన్ హాల్ కు ఎందుకు తాళం వేశారని అడిగారు. ఓపెన్ హాల్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తనకు బిల్లు చెల్లించలేదని హాల్ కు తాళం వేసుకుని వెళ్లారని డీఈఓ గోవిందరాజులు కలెక్టర్ కు తెలిపారు. నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్లు ఇచ్చినా..ఇవ్వక పోయినా తాళం వేసుకుని వెళ్లరాదని, వెంటనే హాల్ ను తెరిపించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పాఠశాల లో బియ్యం బస్తాలను కలెక్టర్ పరిశీలించారు. బియ్యం,వంటకు వినియోగించే సరకులను నిల్వ ఉంచే గది ఎల్లపుడూ శుభ్రంగా ఉండేటట్లు చూడాలన్నారు. వంటగది లోకి వెళ్ళిన కలెక్టర్ అక్కడ విద్యార్థులకు వండు తున్న అన్నం,పప్పు ను చూసి మెనూ ప్రకారం పప్పుతో పాటు కర్రీ కూడా వండాలని ఎందుకు వoడ లేదని ఏజెన్సీ యువకులను నిలదీశారు. మెనూ ప్రకారమే బిల్లులు తీసుకుంటున్నారని అలాంటప్పుడు మెనూ ప్రకారమే పెట్టాలని తేల్చి చెప్పారు. తమకు గత ఆరు నెలలుగా బిల్లులు రాలేదని వంట ఏజెన్సీ నిర్వాహకులు కలెక్టర్ కి తెలపడంతో సంతృప్తి చెంది, ఎన్ని సంవత్సరాలుగా ఏజెన్సీ నడుపుతున్నారని కలెక్టర్ ప్రశ్నించగా 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నట్లు ఏజెన్సీ నిర్వాహకురాలు చెప్పడంతో 6 నెలల బిల్లులు రాకపోతే మెనూ ప్రకారం భోజనం పెట్టరా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించని ఏజెన్సీ నిర్వాహకురాలికి మోమో జారీ చేయాలని డీఈఓ ను ఆదేశించారు. తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ, మున్సిపల్ కమిషనర్ సునీత, యాదయ్య శెట్టి పాల్గొన్నారు.