వాస్తవాలను వెలికి తీస్తున్న దిశ

by Naveena |
వాస్తవాలను వెలికి తీస్తున్న దిశ
X

దిశ, చింతపల్లి : దిశ పత్రిక అతి తక్కువ సమయంలో ప్రజల మన్ననలు పొందుతున్న పత్రికగా నిలిచిందని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. మంగళవారం దిశ దినపత్రిక నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్రిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దిశ శ్రీకారం చుట్టిందని అన్నారు. మన చుట్టూ జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచడం అభినందనీయమన్నారు. ఇలాంటి పక్షపాత ధోరణి లేకుండా అటు ప్రజలకు ప్రభుత్వానికి సమాచారం అందిస్తుంది అన్నారు. దిశ పత్రిక యజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. పత్రిక రంగంలో ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దిశాపత్రిక రిపోర్టర్లు రేణుక, అచ్యుత్ కుమార్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed