- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్రమ మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్టు.. 4 వాహనాలు స్వాధీనం
దిశ,కడప: కడప నగరంలో అక్రమ మద్యం రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.3 లక్షలు విలువ చేసే 320 పుల్ బాటిల్స్, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎక్సైజ్ సి.ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో నగర శివారులోని ఆలం ఖాన్ పల్లి సర్కిల్ వద్ద ఇరువురు వ్యక్తులు కారులో వున్న మద్యాన్ని స్కూటీలో మార్చుకుంటుండగా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ సి.ఐ నీలకంఠారెడ్డి, టౌన్ సి.ఐ కృష్ణకుమార్ లు వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
వీరి వద్ద నుండి పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన నెపోలియన్ కొరియర్ బ్రాండ్, మ్యాన్షన్ హౌస్, మెక్ డొల్ విస్కీ మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఇరువురిని విచారించగా ఐ.టి.ఐ సర్కిల్ లో రఘురామిరెడ్డి అనే వ్యక్తి మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారన్నారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు శాటిలైట్ సిటీ వద్ద ఐషర్ వాహనం, టాటా ఎస్ లో వున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో శివ, వెంకటేష్, మహేష్ అనే వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. ఈ రెండు సంఘటనలో రూ.3 లక్షలు విలువ చేసే 320 పుల్ మద్యం బాటిల్స్ , రూ.6 నుంచి రూ.7 లక్షలు విలువ చేసే 4 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ మద్యాన్ని పాండిచ్చేరి, కాట్పాడి నుండి అక్రమంగా తీసుకు వస్తున్నారన్నారు. మ్యాన్షన్ హౌస్, మెక్ డోల్ నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారని తెలిపారు. రఘురామిరెడ్డి ప్రూట్స్ వ్యాపారం మాటున మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. రఘురామిరెడ్డిని అరెస్టు చేయాల్సి ఉందని, ఈయన వెనుక ఇంకా ఎవరైనా వున్నారా అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. రఘురామిరెడ్డి, శివ అనే వారు గత నాలుగు సంవత్సరాలుగా మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. రఘురామిరెడ్డి మద్యం అక్రమ రవాణా ఎక్కువ సార్లు పాల్పడడంతో ఆయన పి.డి యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపామన్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా నకిలీ మద్యాన్ని తీసుకువచ్చి తక్కువ రేటు విక్రయిస్తున్నారని, అక్రమ మద్యం తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వైన్ షాపుల్లో మద్యం తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం జరగదన్నారు.