PGCIL Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగ అవకాశాలు.. లక్షకు పైగా జీతం..!

by Maddikunta Saikiran |
PGCIL Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగ అవకాశాలు.. లక్షకు పైగా జీతం..!
X

దిశ, వెబ్‌‌డెస్క్: గురుగ్రామ్(Gurugram)లోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ ఆఫీస్ లలో ఖాళీగా ఉన్న 71 ట్రైనీ ఆఫీసర్(Trainee Officer) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.powergrid.in/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 24 డిసెంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

ట్రైనీ ఆఫీసర్ - 71

విద్యార్హత:

కనీసం 60 శాతం మార్కులతో ఫుల్ టైం డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ పూర్తి చేసి ఉండాలి. అలాగే యూజీసీ నెట్-2024 స్కోర్ తప్పని సరిగా ఉండాలి.

వయోపరిమితి:

24 డిసెంబర్ 2024 నాటికి అభ్యర్థులు వయసు 28 ఏళ్లకు మించి ఉండకూడదు.

ఎంపిక ప్రక్రియ:

యూజీసీ నెట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

పే స్కేల్:

ఈ పోస్టులకు ఎంపికైన వారికి ట్రైనింగ్ టైంలో నెలకు రూ. 40,000, ట్రైనింగ్ పూర్తి అయ్యాక నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,60,000 జీతం ఉంటుంది.

Advertisement

Next Story