CTET-2024: సీటెట్ టెస్ట్ సిటీ ఇంటిమేషన్ విడుదల చేసిన సీబీఎస్ఈ

by Maddikunta Saikiran |
CTET-2024: సీటెట్ టెస్ట్ సిటీ ఇంటిమేషన్ విడుదల చేసిన సీబీఎస్ఈ
X

దిశ, వెబ్‌‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాల(Schools)ల్లో ఉపాధ్యాయ(Teacher) నియామకాల భర్తీకి నిర్వహించే సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024(CTET-2024) సిటీ ఇంటిమేషన్ సీబీఎస్ఈ(CBSE) అధికారిక వెబ్‌సైట్ https://examinationservices.nic.in/లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్(Application No), డేట్ ఆఫ్ బర్త్(DOB) డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి నగరం గురించి తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష డిసెంబర్ 14న జరగనుంది. సీటెట్ టెస్ట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు జరుగుతుంది. మొత్తం 20 లాంగ్వేజెస్(20 languages)లో రెండు పేపర్లలో నిర్వహిస్తారు మొదటి పేపర్ ఒకటి నుంచి ఇదో తరగతులకు టీచ్ చేసే వారి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించే వారికోసం కండక్ట్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed