- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Additional Collector : కుటుంబ సర్వేకు ఏర్పాట్లు పూర్తిచేయాలి
దిశ బ్యూరో, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంఈఓలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటింటి సర్వే సన్నద్ధత, ధాన్యం, పత్తి కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రాథమిక పాఠశాల టీచర్లను ఎన్యుమరేటర్లుగా వినియోగించాలని, ప్రాథమిక పాఠశాలలు ఉదయం ఒక పూట మాత్రమే పని చేయాలని, మధ్యాహ్నం నుంచి టీచర్లు ఎన్యుమరేషన్ లో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. సెలవు రోజుల్లో పూర్తి స్థాయిలో ఎన్యుమరేషన్ జరిగేలా ఉండాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లను మండలాల వారీగా 10 శాతం రిజర్వ్ తో సహా వెంటనే నియమించి, వారికి శిక్షణ అందజేయాలని సూచించారు.
ప్రతి సూపర్ వైజర్ పరిధిలో ఒక రిజర్వ్ బృందం ఉండాలని అన్నారు. ప్రతి ఎన్యుమరేటర్ తన పరిధిలో 150 ఇండ్లు సర్వే చేసి ఇంటి పైన స్టిక్కర్ అతికించాలని కోరారు. నవంబర్ 5వ తేదీ నాటికి హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని అన్నారు. నవంబర్ 6, 7 తేదీలలో రెండవ దఫా ఎన్యుమరేటర్ లకు, డేటా ఎంట్రీ బృందాలకు శిక్షణ నిర్వహించాలని అన్నారు. ఒక సూపర్ వైజర్ పరిధిలో కనీసం ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని , అవసరమైన పక్షంలో స్థానికంగా ఉన్నవారిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న సరిహద్దు మండలాల పరిధిలో చెక్ పోస్టుల వద్ద అధికారులకు డ్యూటీలు కేటాయించాలని అన్నారు. జిల్లాలో 5 మండలాల పరిధిలో ఉన్న 9 పత్తి కొనుగోలు కేంద్రాలను సంబంధిత తహసీల్దార్ లు సందర్శించి రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయాలని అన్నారు.
కోనుగోలు కేంద్రాలలో అవసరమైన పరికరాలు ఉండేలా జిల్లా మార్కెటింగ్ అధికారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గన్నీ సంచుల లభ్యత పరిశీలించి అవసరమైనన్ని ఆర్డర్ పెట్టాలని అన్నారు. ధాన్యం కొనుగోలు, ఎన్యుమరేషన్ లో ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే 1077 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, దీనిపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, సీపీఓ ఏ. శ్రీనివాస్, డీఈఓ సోమశేఖర శర్మ, డీఆర్ఓ రాజేశ్వరి, ఆర్డీఓ లు, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, నియోజకవర్గ ఇన్చార్జి అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపీఓలు, ఎంఎస్ఓలు, సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.