- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao : హామీలు..ఉద్యోగాలలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
దిశ, వెబ్ డెస్క్ : హామీల అమలు, ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి టీ.హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ ప్రగతి వివరాలతో ప్రధాని నరేంద్ర మోడీకి చేసిన ట్వీట్ అంశాలను హరీశ్ రావు(Harish Rao) ట్విటర్ వేదికగా తప్పుబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో 1,61,000 పోస్టులను భర్తీ చేసిందని, కానీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. 50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి డబ్బా కొట్టుకొడుతున్నారని, మీరు చెప్పే 50 వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలోనే నోటిఫై చేసి, పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినవే కాదా? అని ప్రశ్ని్ంచారు. ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ నియామకాలకు నియామక పత్రాలు ఇచ్చి, అవన్నీ తామే చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
కాంగ్రెస్ మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఈరోజుకి 10% కూడా పూర్తి చేయలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. 2023 డిసెంబరు 9వ తేదీకి రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా, అర్హులైన రైతుల్లో సగానికి పైగా ఇంకా వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రతి నెలా రూ. 4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా, 11 నెలల తర్వాత కూడా అమలు చేయలేదనా, 18 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదని, ప్రతి విద్యార్థికి రూ. 5 లక్షలతో విద్యా భరోసా కార్డు ఇస్తామన్న హామీ ఇంకా ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. ప్రతి పంటకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, సన్న రకాలకు మాత్రమే పరిమితం చేశారని, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం హామీ ఉసేలేదని, మహిళా విద్యార్థులకు ఎలక్ట్రిక్ వాహనాల హామీ గుర్తు కూడా లేదని ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు నెరవేరతాయని చెప్పారని, కానీ, ప్రభుత్వం వచ్చి 300 రోజులు గడిచినా హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శి్ంచారు. కొత్త హామీల సంగతి దేవుడెరుగు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను అటకెక్కించిందని, రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్, న్యూట్రీషియన్ కిట్, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్, బతుకమ్మ చీరలు వంటి ఎన్నో పథకాలు నిలిచిపోయాయని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే..రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం వారి వైఫల్యాలను విజయాలుగా చూపించేందుకు విఫల యత్నాలు చేస్తూ దేశ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇది నిజంగా సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శి్ంచారు.