- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల కళ్లల్లో ఆనందం.. సన్నాలకు రూ.500 బోనస్ కింద రూ.80 కోట్లు జమ
దిశ, తెలంగాణ బ్యూరో: సన్న వడ్లకు బోనస్ ఫలితాలు రైతులకు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సెల్‌ఫోన్లకు టింగ్.. టింగ్ మంటూ మేసెజ్‌లు వెళ్తున్నాయి. దీంతో రైతుల కళ్లల్లో అనందం వెల్లివిరిస్తుంది. శుక్రవారం వరకు రైతులు తమ ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లుగా సమాచారం వచ్చింది. ఇప్పటి వరకు సన్న వడ్లకు సంబంధించి రూ.80 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానా కాలం సీజన్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. వర్షాలు పుష్కలంగా పడటం, విద్యుత్ సరఫరా లాంటి వాటితో పంట దిగుబడి రికార్డు స్థాయిలో పండింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. మొత్తం 8,184 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్మంగా నిర్ణయించగా శుక్రవారం వరకు 7,982 కేంద్రాలను ప్రారంభించారు. మొత్తం 20.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లుగా అధికారిక వర్గాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సన్న వడ్లు 5.14 లక్షల మెట్రిక్ టన్నుల కాగా దోడ్డు వడ్లు 15.19 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. వీటిని 3.18 లక్షల మంది రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల వద్ద విక్రయించారు. రూ.2,760 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతులు విక్రయించారు.
ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, రైతులు ఇక్కట్లు పడకుండా సీఎం రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నిత్యం సమీక్షిస్తుస్తూ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్లు నిత్యం ఏదో ఒక దగ్గర కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. దీంతో కింది స్థాయి యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకు రావాలని సూచిస్తూ రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. అదేవిధంగా వారిలో అవగాహన పెంచుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయగానే వారి అకౌంట్లలో డబ్బులు జమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సన్నాలకు భారీగా డిమాండ్ ఉండటం, ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుండటంతో మిల్లర్లు రైతుల దగ్గరి నుంచి ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా లబ్ధి చేకూరుస్తుంది. బోనస్ ప్రకటనతో గత సంవత్సరానికి కంటే సాగు పెరిగింది. గతంలో 25 లక్షల ఎకరాల్లో మాత్రమే సన్నాలు సాగు కాగా, ఈ సంవత్సరం 40 ఎకరాలు సాగు అయిందని గుర్తించారు. దోడ్డు రకం వడ్లు గతంలో 41 లక్షల ఎకరాల్లో సాగు కాగా ఈ సంవత్సరం 26 లక్షలకు తగ్గింది.
వానా కాలం సీజన్ ధాన్యం కొనుగోలు వివరాలు ఇలా..
కొనుగోలు చేసిన దొడ్డు వడ్లు - 15.19 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు చేసిన సన్న వడ్లు - 5.14 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం - 20.33 లక్షల మెట్రిక్ టన్నులు
దోడ్డు వడ్లు అమ్మిన రైతులు - 2,47,800
సన్న వడ్లు అమ్మిన రైతులు - 70,357
ధాన్యాన్ని విక్రయించిన మొత్తం రైతుల సంఖ్య - 3,18,157
రైతులకు చెల్లించిన మొత్తం - రూ.2760.22 కోట్లు
సన్న వడ్లకు 500 బోనస్ చెల్లించిన మొత్తం - రూ.80.17 కోట్లు