ఆదర్శ పాఠశాల సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహం లభ్యం..

by Sumithra |
ఆదర్శ పాఠశాల సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహం లభ్యం..
X

దిశ, శంకర్ పల్లి : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదర్శ పాఠశాలలో లభ్యమైన సంఘటన శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ పాఠశాల సెప్టిక్ ట్యాంకులో శుక్రవారం సాయంత్రం విద్యార్థులు ఆటలాడుకుంటుండగా సెప్టిక్ ట్యాంక్ పైన మూత లేకపోవడంతో పైకి తేలిన శవం చూసి ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన శంకరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ సిబ్బందితో కలిసి వచ్చి సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందితో శవాన్ని వెలికి తీశారు.

శవం పూర్తిగా కుళ్ళిపోయింది. అయితే వెలికి తీసిన శవం నుంచి తలతో పాటుగా రెండు చేతులు ఊడిపోయి ఉన్నాయి. ట్యాంకులో తలను వెతకగా కొద్దిసేపటికి లభ్యమయింది. చేతులు మాత్రం దొరకలేదు. సుమారు నెలరోజుల క్రితం చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని తెలిపారు. ప్రమాదవశాత్తు కాలుజారి ట్యాంకులో పడి చనిపోయాడా ? లేక ఎక్కడైనా చంపేసి ట్యాంకులో పడవేశారా ? మృతుని వివరాలకు కూడా తెలియ రాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed