- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలను పెంచాలి
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక చొరవతో ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రసవాలను పెంచాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ దవాఖాన, బస్తీ దవాఖానలోని వైద్యాధికారులకు వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భవతుల నమోదు కార్యక్రమం వంద శాతం నమోదు చేయాలన్నారు.
అందరికీ టీడీ వ్యాక్సిన్ వేయాలని, నాలుగు ఏఎన్సీ చెకప్ లు చేయించి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివరీలు ప్రోత్సహించాలని కోరారు. పుట్టిన పిల్లలందరికీ వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. పర్యవేక్షకులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆశ, ఏఎన్ఎం లకు మార్గదర్శనం చేస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.ప్రమోద్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డా. శ్రీనివాస్, డా. అర్చన, జైపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.