- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lawrence Bishnoi: అన్మోల్ బిష్ణోయ్ అరెస్టుకు రంగం సిద్ధం
దిశ, నేషనల్ బ్యూరో: లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) సోదరుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు పావులు కదుపుతున్నారు. లారెన్స్ సోదరుడు అన్మోల్ (Anmol Bishnoi) గురించి అమెరికా అలర్ట్ చేయడంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో అతడిని భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలను (Extradition Process) ముంబై పోలీసులు వేగవంతం చేశారు. సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పులు, బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ గత నెల ముంబై పోలీసులు ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. లారెన్స్ తరఫున అన్మోల్ పలు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగమయ్యాడని ఆ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.
సమాచారమిచ్చిన అమెరికా
కాగా.. అన్మోల్ కదలికల గురించి అమెరికా అధికారులు ముంబయి క్రైమ్ బ్రాంచ్ కి సమాచారమిచ్చారు. దీంతో, అతడిని భారత్‌కు రప్పించే ప్రయత్నాలను మొదలుపెట్టిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక, ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్‌ఖాన్ ఇంటివద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దానికి బాధ్యత వహిస్తూ అన్మోల్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. ఆ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అన్మోల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడిపై దాదాపు 18 కేసులున్నాయి. నకిలీ పాస్ పోర్టులో భారత్ విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.