Nigeria: నైజీరియా ప్రభుత్వం క్రూరత్వం.. 76 మందికి మరణశిక్షలు

by Shamantha N |
Nigeria: నైజీరియా ప్రభుత్వం క్రూరత్వం.. 76 మందికి మరణశిక్షలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నైజీరియా(Nigeria) ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోంది. ఆకలికి తాళలేక రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న వారిని జైళ్లో పెడుతూ శిక్షలు విధిస్తోంది. పలువురికి మరణశిక్షణలు విధించడం గమనార్హం. నైజిరియాలో రికార్డుస్థాయిలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆకలి సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. అందులో పాల్గొన్నందుకు అక్కడి పోలీసులు మొత్తం 76 మందిపై శుక్రవారం (నవంబర్ 2) రోజున కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా 10 ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేసులు విచారణ జరిపిన కోర్టు.. వారందరికీ మరణశిక్ష(Death Sentence) విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ 76 మందిలో 29 మంది చిన్నారులకు కూడా మరణశిక్ష పడటం కలిచివేస్తోంది. ఈ 29 మంది పిల్లల వయసు కేవలం 14 ఏళ్ల లోపే కావడం మరింత సంచలనంగా మారింది. అయితే నైజీరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్, మరణశిక్ష విధించడానికి అనుమతి లేదని మైనర్ల తరఫు లాయర్ చేసిన వాదనతో అక్కడి కోర్టు ఏకీభవించింది. దీంతో ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పూచికత్తుతో కఠినమైన ఆంక్షలతో బెయిల్ మంజూరు చేసింది.

నైజీరియాలో గడ్డు పరిస్థితులు

ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశమైన నైజీరియాలో ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. తిండి దొరక్క ప్రజలు వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. ఆగస్ట్‌లో నైజీరియా యువత రోడ్డెక్కి నిరసనలు చేసింది. ఈ నిరసనల్లో 20 మంది యువకులను కాల్చి చంపగా.. వందలాది మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 1970లో నైజీరియాలో మరణశిక్ష అమలులోకి వచ్చింది. అయితే 2016 నుంచి నైజీరియాలో ఏ ఒక్కరికీ ఉరిశిక్ష అమలు కాలేదు. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. పశ్చిమాసియా దేశాల్లో తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంటున్న దేశం నైజీరియానే. కనీసం రోజుకు ఒకపూట భోజనం కూడా దొరకని దుస్థితిని నైజీరియా ప్రజలు ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed