పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్

by Sumithra |
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ధరణి మాడ్యూల్స్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహశీల్దార్ లకు మార్గ నిర్దేశం చేశారు. ధరణి, మీసేవ, షాది ముబారక్, కల్యాణ లక్ష్మి, ఓటరు నమోదు పై రివ్యూ నిర్వహించారు. రెవెన్యూ యాంత్రాగం జరగకుండా, ప్రధాన భూమిక పోషించాలన్నారు. ధరణి మాడుల్స్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేయాలన్నారు.

అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన ధరణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని మండల తహశీల్దార్లను ఆదేశించారు. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఎన్ని పరిష్కరించారనే, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయని ఆరా తీశారు. పెండింగ్ ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సక్సేషన్, పెండింగ్ మ్యూ టేషన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే పరిష్కరించాలని అన్నారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వీరారెడ్డి, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి, మండలం తహశీల్దార్ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed