- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్ యార్డుల్లో ధాన్యం.. ఓపెన్ కాని కొనుగోలు కేంద్రాలు..
దిశ, తిరుమలగిరి (సాగర్) : మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నేటికీ ప్రారంభించలేదు. ఇప్పటికే పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు చేరవేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమకాల పరిధిలోని రాజవరం మేజర్ లో వరిని వేసిన రైతులు ఇప్పటికే కోతలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ఓ ప్లెక్సీని ఏర్పాటు చేశారే తప్ప తదుపరి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అయోమయానికి గురౌతున్న రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండాపోయింది. ఆకాశం మబ్బులతో కూడి ఉండడంతో ఎప్పుడు వర్షం పడి దాన్యం తడిసిపోతుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది అదునుగా ఉపయోగించిన దళారులు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దళారులను ఆశ్రయిస్తున్న రైతులు ప్రభుత్వం ప్రకటిస్తున్న 500 బోనసును కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన దళారులు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మి లాభాలు గడిస్తున్నట్టు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు